HomeMovie newsPawankalyan:పెండింగ్ మూవీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాడా లేదా?

Pawankalyan:పెండింగ్ మూవీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాడా లేదా?

మే 13నా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసాయి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం MLA అభ్యర్థి గా ఎన్నికలలో నిల్చున్నాడు అని మన అందరికి తెలిసిన విషయమే. జూన్ 4నా ఎన్నికల రిజల్ట్స్ విడుదల అవుతుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు సినిమాలు పక్కన పెట్టారు ఎలక్షన్స్ కారణంగా ప్రచారాలు పై బిజీగా ఉన్నాడు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ముగిసాయి కాబ్బటి సినిమాలపై ద్రుష్టి పెట్టాలి.

పవన్ కళ్యాణ్ పెండింగ్ మూవీస్ ఏంటో చూద్దాం! ఫస్ట్ పాన్ ఇండియా మూవీ (OG) ఓజీ’ (OG) సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఒక 20 రోజులు కాల్షీట్స్ ఇస్తే.. ఆ సినిమా కంప్లీట్ అయిపోతుంది. మరోపక్క ‘ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా 40 శాతం కంప్లీట్ అయ్యింది. పవన్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవ్వాలంటే దానికి 35 రోజుల కాల్షీట్స్ ఇవ్వాలట. ఇవి కాకుండా క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ అనే సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చెయ్యాలి.

అది 2 పార్టులుగా రూపొందుతుంది. ఈ ఏడాది చివరికి మొదటి పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే.. అసెంబ్లీకి వెళ్తారు. ఆ ఛాన్సులు ఉన్నాయి. ఇలాంటి టైంలో పవన్ ఈ 3 సినిమాలని 2024 లో కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారా? అనే అనుమానాలు కూడా ఇంకొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. ఏదేమైనా పవన్ మాత్రం పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టి నిర్మాతలకి విముక్తి కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే చెప్పాలి.

RELATED ARTICLES
Be the first to write a review

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular